Tuesday, May 2, 2023

Bronchitis asthma

Bronchitis asthma.,.
ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ఆస్తమా ఇబ్బందిని నివారించవచ్చు.
ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ ఉండవనే విషయం మనందరికీ తెలిసిన విషయమే....
మా వద్ద ఆస్తమాకు చికిత్స తీసుకున్నటువంటి వారు A.C గదుల్లో చాలా హాయిగా ప్రశాంతంగా గడపవచ్చు. ఎటువంటి శ్వాస సంబంధితమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిద్రించవచ్చు కూడా. అలాగే కూల్డ్రింక్స్,  ఐస్ క్రీమ్స్ మరియు జలుబు చేసేటటువంటి లేదా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి ఇబ్బంది పెట్టే ఇతర ఏ ఆహార పదార్థాలనైనా సంతోషంగా ప్రశాంతంగా తినవచ్చు, తాగవచ్చు. ఇలా జీవించడం మా వద్ద చికిత్స తీసుకునేటటువంటి ఆస్తమా వ్యాధిగ్రస్తులకు సాధ్యమే.....

నేరుగా సంప్రదించవచ్చు.... లేదా కొరియర్ ద్వారా మెడిసిన్ అందుకోవచ్చు....

 ఈ అడ్రస్ లో సంప్రదించగలరు....
 Dr.Mahesh
Ayurveda & Siddha
402, 2nd line, Gayathri Nagar , beside excise station, Mahatma Gandhi inner ring road, Guntur - 522034.
Cell : 97019 65700 ;.  86866 22900.

Friday, October 27, 2017

మైగ్రేన్ (పార్శ్వపు నొప్పి) శాశ్వత పరిష్కారం
ఈ దివ్యెౌషధం పూర్తి ఉచితంగా అందించబడుతుంది.
ఏదో ఒక సమయంలో తలనొప్పి అందరికీ వస్తుంది. కానీ రెండు మూడు రోజుల పాటే గదికి మాత్రమే పరిమితం చేసే మైగ్రేన్‌ వస్తే ఆ బాధ చెప్పనలవి కాదు. నొప్పి నివారణ మాత్రలు ఈ తలనొప్పి పరిష్కారం చూపించకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. అయితే ఆయుర్వేదంతో ఈ తలనొప్పి సమూలంగా, శాశ్వతంగా నివారణవుతుంది. ఇందులో అసాధ్యం ఎంతమాత్రం లేదు.
పార్శ్వపు నొప్పి ఒక దీర్ఘకాలికమైన నరాల సంబంధ వ్యాధి. ఒక మాదిరి నుంచి తీవ్రమైన తలనొప్పి ఈ వ్యాధిలో కనిపించే ప్రధాన లక్షణం. సాధారణంగా ఈ నొప్పి తలలో ఒక పక్క మాత్రమే బాధిస్తుంది. మెదడులోని సెరిబ్రల్‌ కోరెట్స్‌ అనే భాగం తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుంది. సాధారణంగా నొప్పి 24 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. విపరీతమైన తలనొప్పితో పాటు వికారంతో కూడిన వాంతులు, వెలుతురు, శబ్ధాలు భరించలేకపోవడం జరుగుతుంది.
కారణాలు
పార్శ్వపు నొప్పికి చాలా వరకు ప్రత్యేకమైన, ఖచ్చితమైన కారణాలు నిర్ధారణ కాలేదు. కాని కొన్ని రకాల రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ అంటే జన్యుపరమైన, వాతావరణ పరిస్థితుల కలయిక వల్ల తలనొప్పి రావచ్చు. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. నొప్పి రావడానికి ప్రత్యేకమైన కారణాలు లేకపోయినప్పటికీ నొప్పిని తీవ్రతరం చేసే, నొప్పికి అనేక అంశాలు దారితీస్తాయి. వీటిని ట్రిగ్గర్‌ ఫ్యాక్టర్స్‌ అంటారు. ఇలాంటి ట్రిగ్గర్స్‌ తలనొప్పి ప్రారంభం కాకముందే అంటే 24 గంటల ముందు నుం చి ఉండవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి.
శారీరక సంబంధమైన విషయాలు: విపరీతమైన ఆకలి, నీరసం, శారీరకశ్రమ వల్ల నొప్పి ప్రారంభమవుతుంది. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల అనగా కుటుంబనియంత్రణ కోసం టాబ్లెట్స్‌ వాడటం, రుతుక్రమ సమయంలో, గర్భధారణ సమయంలో నొప్పి ఎక్కువగా వస్తుంది.
ఆహార సంబంధమైన విషయాలు: కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఆ ఆహారపదార్థాలు అనేవి ఆ వ్యక్తికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి.
వ్యాధి లక్షణాలు: చాలా సందర్భాల్లో పార్శ్వపు నొప్పి దానంతట అదే తగ్గుతుంది. నొప్పి ప్రారంభమయ్యే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. దీని వైద్యపరిభాషలో ‘‘ఆరా’’ అంటారు. పార్శ్వపు నొప్పి విధానాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
1. ప్రోడ్రోమల్‌ స్టేజ్‌ : ఇది నొప్పి ఆరంభం కావడానికి రెండు, మూడు గంటల ముందు లేక ఒకటి రెండు రోజుల ముందు మొదలవుతుంది. మానసిక ఆందోళన, చిరాకు, కోపం, కండరాలు బిగపట్టడం, ముఖ్యంగా మెడ కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2. ఆరా స్టేజ్‌: ఇది తలనొప్పి మొదలైన కొద్దినిమిషాల్లోనే ప్రారంభమై గంటల వరకు కొనసాగుతుంది. చూపు మసకగా ఉండటం, భుజం దగ్గర పొడిచినట్లుగా ఉండటం వంటి లక్షణాలుంటాయి.
3. నొప్పిస్టేజ్‌: నొప్పి ఒకవైపు ప్రారంభమవుతుంది. నొప్పి క్రమేణా పెరుగుతుంది. 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. విపరీతమైన తలనొప్పితో పాటు వాంతులు, కాంతి, శబ్ధాలు భరించలేకపోవడం వంటి లక్షణాలుంటాయి.
4. పోస్ట్‌డ్రోమ్‌ స్టేజ్‌: తలనొప్పి తగ్గిన తరువాత ఉండే స్థితి ఇది. నీరసం, జీర్ణాశయ సంబంధ వ్యాధులు, మానసిక అలజడి ఉంటుంది.
ఆయుర్వేద చికిత్స
పార్శ్వపు నొప్పికి సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. 100% శాశ్వత పరిష్కారం సాధ్యమే.
ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధ పడుతున్నప్పటికీ పూర్తి నివారణ సాధ్యమే.
ఈ దివ్యెౌషధాన్ని పూర్తి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Dr.Mahesh
Ayurveda & Siddha
4/1, Ashok Nagar,
Lakshmipuram Road,
Nayar Hotel Center,
near Saibaba Temple,
Guntur - 522006
cell no: 97019 65700
86866 22900
మా క్లినిక్ నందు నేరుగా సంప్రదించిన వారికి మాత్రమే.

Sunday, August 6, 2017

"ధర్మార్ధ కామ మోక్షాణామ్ ఆరోగ్య మూలముత్తమమ్ "
ఆయుర్వేద ఒౌషధ సేవన వలన శరీరంలో సహజంగా వున్న జీవశక్తిని (రెసిస్టెన్స్ పవర్) పెంపొందించుచూ వ్యాధులను నిర్మూలిస్తుంది. కనుక ఆయుర్వేద ఒౌషధములకు ఏవిధమైన దుష్ప్రభావాలు వుండవు.
ఆకలి అయినప్పుడు అన్నం తిన్నట్లే, రోగం వస్తే ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం వల్ల రోగ నివారణతో పాటు, శరీరానికి శక్తి సామర్ధ్యాలు సమకూరుతాయి.
ఆయుర్వేద వైద్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపిద్దాం. ఆరోగ్యవంతులు మాత్రమే మంచి ఆలోచనలతో ప్రగతి సాధించగలరు.
"మంత్రమునకు పనికిరాని అక్షరం లేదు, వైద్యమునకు పనికారాని మొక్క లేదు, ఆయుర్వేద ఒౌషధముల వలన నయము కాని వ్యాధి లేనేలేదు".

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

మడమ నొప్పి

ఏ అవయవం పనితీరు పైనైనా మన దృష్టి పడుతోందీ అంటే ఆ అవయవంలో ఏదో సమస్య ఉందని అర్థం. ఎవరైనా మడమల్నీ, పాదాల్నీ తరుచూ చూసుకుంటూ, ఆవైపు, ఈ వైపు నొక్కుకుంటున్నారూ అంటే నిరంతరంగా, ఏదో బాధ వేధిస్తోందని ఇట్టే గ్రహించవచ్చు.. అయినా శరీరంలో కళ్లూ, కాళ్లూ సరిగా లేనిదే అడుగైనా ముందుకు వేయలేం కదా! మడమనొప్పులు ఉన్నవారి పరిస్థితే ఇది. ఈ సమస్య రావడానికి గల కారణాల్లోకి వెళితే....
నడిచే విధానం సరిగా లేకపోయినా, వాడే చెప్పులు సరియైనవి కాకపోయినా, ఎత్తుపల్లాల్లో నడుస్తున్నప్పుడు అడుగులు సరిగా వేయలేకపోయినా మడమ నొప్పులు వస్తాయి. ఇవే కాకుండా, స్థూలకాయం ఉన్నా, వాత సంబంధిత వ్యాధులున్నా, ధాతుక్షయం జరిగినా మడమనొప్పులు వస్తాయి. రోజూ కనీసంగానైనా నడవలేకపోయినా, అతిగా నడిచినా, అత్యుష్ణము అను కారణాలచేత కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి సమస్యకు అదేపనిగా మందులు వాడకుండా, ఆయుర్వేదంలోని గృహవైద్య విధానంతో పూర్తిగా బయటపడే ప్రయత్నం చేయవచ్చు.
కొన్ని ఉత్తమ చిట్కాలు:
(1) శొంఠిని శుభ్రపరిచి చూర్ణం చేసి ఉంచుకోవాలి. అందులోంచి 5 గ్రాముల శొంఠి చూర్ణాన్ని, 100 మి. లీటర్ల నీళ్లల్లో కలిపి, అవి 50 మి.లీటర్లు అయ్యేదాకా బాగా కాచి, అలా తయారైన కషాయాన్ని వడగట్టి అందులో 15 మి. లీ ఆముదం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు నొప్పి పూర్తిగా తగ్గేవరకు తాగాలి.
(2) నిమ్మకాయలను రెండు ముక్కలుగా కోసి, పెనం పైన వేడి చేసి, మడమల మీద కాపడం పెట్టాలి.
(3) పెట్రోల్ ను నొప్పి వున్న భాగంపై మర్ధన చేయడం అనేది మడమనొప్పికి అత్యుత్తమ చికిత్సగా చెప్పవచ్చు.
పైన చెప్పినవి పాటించడంతో పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, కళ్ళు ఉప్పును నిప్పుపై వెచ్చ చేసి, ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తూ ఉంటే మడమనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Back Pain

ఆయుర్వేదంతో వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం


ఈ రోజుల్లో స్పాండిలైటిస్‌ అనే  మాట ప్రతి పదిమందిలో ముగ్గురి నోట వినిపిస్తూనే ఉంది.  మూలస్థంభం లాంటి వెన్నెముక దెబ్బ తింటే ఎవరైనా ఆ విషయమై మాట్లాడకుండా ఎలా ఉంటారు?  కాకపోతే  వెన్నెముక లేదా డిస్కులకు సంబంధించిన ప్రతి సమస్యకూ సర్జరీయే పరిష్కారం అంటూ సాగుతున్న ప్రచారం చాలామంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నునొప్పి కోసం సర్జరీ చేయించుకుంటే ఆ నొప్పి తాత్కాలికంగా తగ్గుతోందే కానీ, శాశ్వతంగా పోవడం లేదు.  దానికి వెన్నునొప్పి రావడానికి గల అసలు కారణం తెలియకపోవడమే సమస్య అయితే,  వాత,పిత్త,కఫాల దోషాలను, ధాతుక్షయాన్ని సమర్థవంతంగా నిర్మూలించడం ద్వారా ఆయుర్వేదం ఒక్కటే  స్పాండిలైటిస్‌ సమస్యలను సమూలంగా తొలగించగలుగుతుంది.                              

జీవితాంతం మనం వెన్నెముకతో సహజీవనం చేస్తున్నా దాని గురించి మనకు  తెలిసింది చాలా తక్కువ. వాస్తవానికి  వెన్నెముకది ఒక అద్భుతమైన నిర్మాణం. శరీరాన్ని నిలబెట్టడంలో దాని భూమిక ఎంతో కీలకం. శరీరంలోని సమస్త అవయవాలకూ వెన్నెముక ఒక మూలస్థంభంలా ఉంటుంది. అలా ఒక మూల స్థంభంలా నిలబడటానికి వెయ్యికి పైగా లిగమెంట్లు, కీళ్ల కదలికలకు తోడ్పడే  134 సర్ఫేస్‌లు ఉంటాయి.  మెదడు చివరనుంచి మొదలయ్యే ఈ వెన్నెముకలో మెదడులో ఉండే న్యూరల్‌ సెల్స్‌, వెన్నెముకలోనూ ఉంటాయి. వెన్నెముక శరీరానికీ మెదడుకూ మధ్య ఒక సంధాన కర్తగా ఉంటుంది. అన్నిటినీ మించి మెదడు పంపించే ప్రతి సంకేతాన్నీ, ప్రతి సమాచారాన్నీ శరీరానికి చేరవేసే ఒక రహదారి. మరోరకంగా చెప్పాలంటే వెన్నెముక ఆరోగ్యానికి సంబంధించిన ఒక కీబోర్డు. అన్నీ సవ్యంగా ఉంటే వెన్నెముక దాని విధి నిర్వహణలన్నీ సఖ్యంగానే ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో ఒక చోట తేడా వచ్చినప్పుడు మొత్తం వ్యవస్థ అంతా చిందరవందర అవుతుంది.

కారణాలు అనేకం:

ఆధునిక జీవన శైలిలో పలు అంశాలు ఇందుకు కారణమవుతాయి. వాటిలో ప్రత్యేకించి సమయపాలన లేని భోజనం కావచ్చు. గంటల తరబడి  కద లకుండా కూర్చునే ఉద్యోగ వ్యాపారాలు  కావచ్చు. కదలడం, కూర్చోవడం, నిలుచోవడం వంటి భంగిమల్లోని లోపాలు కావచ్చు. వ్యాయామమే లేకపోవడం కావచ్చు. లేదా అతిగా వ్యాయామం చేయడమే కావచ్చు. ఎడతెగని ఒత్తిళ్లే కావచ్చు. మొత్తంగా చూస్తే  వీటన్నిటి ద్వారా మన శరీరాన్ని మనం దెబ్బ తీసుకుంటున్నాం. దీనివల్ల వెన్నులో భాగమైన కార్టిలేజ్‌, లిగమెంట్లు, టెండాన్లు ఎముకలు దెబ్బతిని  మెడ, వెన్ను భాగాల్లో ఎన్నో తేడాలు వస్తాయి, ఇలాంటి పలురకాల తేడాలతో వచ్చే సమస్యల్లో స్పాండిలైటిస్‌ ఒకటి. నిరంతరం దెబ్బతింటూ, క్షీణావస్థకు గురికావడం వల్ల వెన్నెముకలో వచ్చే ప్రధాన సమస్య ఇది.

స్పాండిలైటిస్‌ అంటే?:

వెన్నెముకలోఉండే కీళ్లకు ఒక క్షీణగతికి తెచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌ రావడాన్నే స్పాండిలైటిస్‌ అంటారు. వెన్నుపూసలో ఉండే దృఢత్వం తగ్గిపోవడం ఇందులోని ప్రధాన సమస్య. వెన్నుపూస దెబ్బతిన్న చోట  బోనీ స్పర్స్‌ లేదా అస్టియో ఫైట్స్‌ అనే బొడిపెలు ఉత్పన్నమవుతాయి.  ఇవి వెన్నుపాము మీద ఒత్తిడి కలిగిస్తాయి. నరాలు, వెన్నెముకపై ఒత్తిడి పడితే  దాని తాలూకు సమస్యలు మొదలవుతాయి. ప్రత్యేకించి మెదడునుంచి శరీరానికి చేరవలసిన సంకేతాలకు , సమాచారానికి సంబంధించిన మార్గం తెగిపోతుంది. ఒకప్పుడు ఈ సమస్య దాదాపు  45 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించేది. ఆధునిక కాలంలో ఇది వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వచ్చేస్తోంది.

అయితే పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు వారిలో సహజంగా ఉండే రుతుక్రమం, హార్మోనల్‌ సమస్యలు, మెనోపాజ్‌కు ముందు లేదా  తరువాత వారిలో వచ్చే హార్మోన్‌ సంబంధిత మార్పులు  గర్భధారణ కారణంగా పెరిగే ఒత్తిళ్లు ఇందుకు ప్రధాన  కారణంగా ఉంటాయి. ప్రత్యేకించి క్యాల్షియం లోపాలను కలిగించే ప్రతి సమస్యా స్పాండిలైటిస్‌కు కారణమవుతూ ఉంటుంది. దీనికి తోడు స్థూలకాయం కూడా ఇందుకు కారణమే. గతంలో మెడ, వెన్ను భాగంలో శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా ఈ సమస్యకు గురికావచ్చు. వీరిలో డిస్కు సమస్యలు ఉన్నవారు కూడా స్పాండిలైటిస్‌ సమస్యకు గురికావచ్చు. ఎముకలు గుల్లబారిపోయే ఆస్టియోపొరోసిస్‌ ఉన్నవారు కూడా ఈ సమస్యకు గురికావచ్చు.

స్పాండిలైటిస్‌లో ఏమవుతుంది?

రోజురోజుకు  వెన్నెముక క్షీణిస్తూ వెళ్లడాన్నే స్పాండిలైటిస్‌ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో వెన్నెముకకు, డిస్కులకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల డిస్కుకి పైన, కింద ఉండే అంచులకు నీటిని పీల్చుకునే గుణం తగ్గిపోతుంది. ఇలా వాటి  నీటి పరిమాణం తగ్గడం వల్ల డిస్కులు కుదించుకుపోతాయి. వాటి ఎత్తు తగ్గిపోవడం చాలా స్పష్టంగా  కనిపిస్తుంది. ఆయా భాగాలు విస్తరించే గుణం కూడా కోల్పోతాయి. ఫలితంగా అక్కడున్న కణజాలమంతా  గట్టిపడిపోతుంది. వెన్నుపూసలో పూసకూ పూసకూ మధ్య ఉండే ఫేసెట్‌ జాయింట్ల మీద ఒత్తిడి పెరిగి రాపిడి పెరుగుతుంది. దీనివల్ల కార్టిలేజ్‌ దెబ్బతింటుంది.

 అయితే శరీర తన సహజ స్వభావం కొద్దీ దెబ్బ తిన్న భాగాలకు క్యాల్షియంను చేరవేస్తుంది. అవసరానికి మించి అలా క్యాల్షియంను చేర్చడం ద్వారా అక్కడ ఆస్టియోఫైట్స్‌ అంటే బొడిపెలు ఏర్పడతాయి. ఒకసారి  బొడిపెలు ఏర్పడటం మొదలయ్యిందీ అంటే అది ఎప్పటికీ తగ్గదు. ఎన్నిసార్లు శస్త్ర చికిత్సలు చేసినా ప్రయోజనం ఉండదు. ఈ బొడిపెలు పక్కనున్న నరాలు అంటే వెన్నుపాము మీద ఒత్తిడి  పడుతుంది. వెన్ను భాగంలో ఇన్ని మార్పులు జరిగినా స్కానింగ్‌ పరీక్షల్లో  అన్నీ నార్మల్‌గానే కనపడతాయి. చాలా మంది డాక్టర్లు  అసలు  మీకు ఏ సమస్యాలేదని. మీరు మానసికంగా అలాంటి భ్రాంతికి గురవుతున్నారని, ఇది సైకోసొమాటిక్‌ వ్యాధి అని  చెప్పి వదిలేస్తారు. పరీక్షా రిపోర్టులు నార్మల్‌ అని వచ్చినంత మాత్రాన మీరు ఆరోగ్యవంతులని కాదు కదా! మీరు అనారోగ్యంతో ఉన్నారని మిమ్మల్ని వేధిస్తున్న లక్షణాలే  చెబుతున్నాయి.

 ఆధునిక పరీక్షల్లో వ్యాధి ఒక పూర్తి రూపం ధరించినప్పుడు తప్ప వ్యాధిగా మారుతున్న  క్రమంలో గుర్తించే శక్తి లేదు. అయితే ఆయుర్వేద పరీక్షల్లో మాత్రం ఈ స్థితిలో కూడా సమస్యను గుర్తించే మార్గం ఉంది. అత్యంత సూక్ష్మస్థాయిలో అంటే వాయురూపంలో ఉండే వ్యాధిని సైతం గుర్తించగలిగే ఆయుర్వేద విధానంలోని ప్రత్యేకతే  ఇందుకు కారణం.

సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ లక్షణాలు:

మెడ, ఛాతీ భాగంలో ఉండే ఈ సర్వైకల్‌లో ఏడు డిస్కులు ఉంటాయి. అయితే సమస్య ఎక్కువగా వచ్చేది సి4-సి5, సి5-సి6, సి6-సి7 డిస్కుల్లోనే. ఈ భాగంలో సమస్య తలెత్తినప్పుడు  కొద్దిపాటి అసౌకర్యంగానో, స్వల్పమైన నొప్పిగానో, లేదా భరించలేనంత నొప్పిగానో ఉండవచ్చు. నొప్పి మరీ తీవ్రమైనప్పుడు కనీసం కదల్లేని స్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ స్థితిలో నొప్పి మూడు దశల్లో ఉంటుంది. అందులో  సర్వైకల్‌  ర్యాడికులోపతి, సర్వైకల్‌ మైలోపతి, సర్వైకల్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ ఇవి  ఆ మూడు దశలు. సర్వైకల్‌ ర్యాడికులోపతిలో ఇందులో ప్రధానంగా తలనొప్పి ఉంటుంది. నొప్పి మెడ, భుజాల మద్య, చేతిపొడవునా ఉండవచ్చు చెయ్యంతా లాగినట్లు అనిపించవచ్చు. ముఖంలోని వివిధ భాగాల్లో నొప్పి అనిపించవచ్చు.  ఒక్కోసారి కళ్లు తిరిగిపడిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సర్వైకల్‌ మైలోపతిలోచేతి, భుజం కండరాలు బలహీనమవుతాయి, ఫలితంగా  అల్లికలు, కుట్లు, పెయింటింగ్‌, రైటింగ్‌ ఇలాంటి నైపుణ్యాలన్నీ దెబ్బ తింటాయి. మెడ, భుజం భాగాల్లో కండరాలన్నీ క్షీణిస్తూ, ఎండిపోయినట్లుమారతాయి. బ్యాలెన్స్‌ కోల్పోయి పదే పదే పడిపోయే స్థితి కూడా ఏర్పడవచ్చు. సర్వైకల్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ నొప్పి ఏదో ఒక కేంద్రీకృతమై ఉండడాన్ని ఆగ్జియల్‌‘ జాయింట్‌ పెయిన్‌ అంటారు.

లంబార్‌ స్పాండిలైటిస్‌:

ఎల్‌1 నుంచి ఎల్‌5-ఎస్‌1 దాకా ఈ సమస్య ఉండవచ్చు. ఇందులోనూ లంబార్‌ ర్యాడికులోపతి, లంబార్‌ మైలోపతి, లంబార్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ అంటూ మూడు దశలు ఉంటాయి. ర్యాడికులోపతిలో నొప్పి, పొడిచినట్లు ఉండడం, మంట, మొద్దుబారడం వంటి లక్షణాలు ఉంటాయి. పిరుదు, తొడవెనుక భాగం, పిక్కల వెనుక భాగంలో మడమ, పాదాల్లో  ఈ భాధలు ఉంటాయి. ఇది గజ్జల భాగంలో కొన్ని సార్లు వృషణాలు, జననాంగం దాకా ఈ నొప్పి ఉండవచ్చు. తొడ, పిక్కలు పట్టేసే సయాటికా లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఒక్కోసారి కడుపులోనూ, మూత్రాశయంలోనూ నొప్పి రావచ్చు. మైలోపతిలో కాళ్లలోని  కండరాలన్నీ క్షీణించిపోయి నడవడం కాదు ఒక దశలో అసలు  కదల్లేని స్థితి ఏర్పడవచ్చు. మల మూత్ర విసర్జనలోనూ సమస్య  మొదలు కావచ్చు. డిస్కు దెబ్బ తిన్న భాగంలోనే కేంద్రీకృతమైన తీవ్రమైన నొప్పిరావచ్చు. ఎక్కువ సేపు నిలుచున్నా, కూర్చున్నా, నొప్పిరావచ్చు.

ఆయుర్వేద చికిత్స:
సమస్యకు అసలు కారణమైన వాత,పిత్త కఫాలను, అగ్నిని  సాధారణ స్థితికి తీసుకురావడం, సస్తధాతువులను సామ్యావస్థకు తీసుకు రావడం ఈ లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుంది,  ఈ  క్రమంలో ఆయా వ్యక్తుల శరీర తత్వాన్ని అనుసరించి చికిత్స వుటుంది.

 ఆయుర్వేదం ద్వారా ప్రధానంగా రెండు ప్రయోజనాలు కలుగుతాయి వాటిలో దీర్ఘకాలికంగా వెంటాడుతున్న మీ బాధలన్నీ తొలగిపోతాయి. అదే సమయంలో వచ్చిన వ్యాధి మరోసారి వచ్చే అవకాశం లేకుండా వ్యాధి మూలాలన్నీ మటుమాయమైపోతాయి. ఆయుర్వేద వైద్య చికిత్సలతో తిరిగి మీ పూర్వ ఆరోగ్యాన్ని పొందడమే కాదు, గతం కంటే అద్భుత మైన ఒక కొత్త జీవ చైతన్యం. ఒక కొత్త జీవితం మీ సొంతమవుతాయి.

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.


సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
 For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/



Rheumatoid Arthritis

రుమాటాయిడ్‌ ఆర్ధరైటిస్ కు సమూల వైద్యం

‘రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌’ అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అనగా మన శరీర రోగనిరోధక వ్యవస్థ పొరబడి, మన సొంత కణజాలంపై దాడిచేయడం వలన కలిగే వ్యాధులను ఆటోఇమ్యూన్‌ వ్యాధులు అని అంటారు. ఈ వ్యాధినే వాడుక భాషలో ‘వాతదోషం’ అని అంటారు. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ వ్యాధి ఎక్కువగా 40 సం.. వయస్సు పైబడిన వారిలో తలెత్తుతుంది. పురుషుల కంటే స్ర్తీలలో 3 రెట్లు అధికంగా, ముఖ్యంగా రుతుచక్రం ఆగిపోయిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 16 సం.. వయస్సు లోపువారిలో ఈ వ్యాధి తలెత్తినచో, దీనిని వైద్య పరిభాషలో ‘జువైనల్‌ ఆర్థరైటిస్‌’ అని అంటారు.

ఈ వ్యాధి కేవలం కీళ్లనే కాకుండా, ఇతర ముఖ్య అవయవాలైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం, రక్తనాళాలు, చర్మం మరియు శరీరంలోని వివిధ రకాల కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా కీళ్ళలోని సైనోవియం పొరను శోథమునకు గురిచేసి, తద్వారా క్రమంగా కీళ్లలోని ఎముకలను, వాటి తాలుకు కార్టిలేజ్‌ని కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా కీళ్లు వాటి ఆకారం, అమరికను కోల్పోయి విపరీతమైన నొప్పి కలగటంతో పాటు కీళ్ల కదలికలు కష్టతరం అవుతాయి. దీర్ఘకాలికంగా ఈ వ్యాధికి గురి అయినట్లయితే వ్యాధి తీవ్రత మరింత పెరిగి, కీళ్ల అమరికలో మార్పులు ఏర్పడి, కీళ్ల వైకల్యానికి దారి తీస్తుంది. కాబట్టి మొదట్లోనే దీనిని గుర్తించి, సరైన చికిత్స అందిచటం ద్వారా ఈ వ్యాధిని అంకురం నుంచే సమూలంగా తొలగించే అవకాశం ఉంటుంది.

లక్షణాలు :

ఈ వ్యాధికి గురైన కీళ్లలో - వాపు, నొప్పి , చేతితో తాకితే వేడిగా అనిపించడం, ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోవడం
 శరీరంలోని ఇరు పార్వ్శాల్లో ఉండే ఒకే రకమైన కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి లక్షణం.
 ఈ వ్యాధి మొదట చిన్న కీళ్లు అయిన చేతి వేళ్లు, కాలి వేళ్లు, వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మణికట్టు, మోచేతులు, భుజాలు, మోకాళ్లు, తుంటి, చీలమండలం వంటి కీళ్లను ప్రభావితం చేస్తుంది.
 కీళ్లు ప్రాంతపు చర్మం కింద ఫైబ్రస్‌ కణజాలం పెరగడంతో అవి బయటకు చిన్న కణితుల్లా కనిపిస్తాయి. వీటినే రుమాటాయిడ్‌ నాడ్యుల్స్‌ అని అంటారు.
 వీటితో పాటు నీరసం, రక్తహీనత, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, జ్వరం వంటి లక్షణాలు కూడా గమనించవచ్చు.
 ఈ వ్యాధి ప్రభావం- ఇతర ప్రధాన అవయవాలైన కళ్లు, చర్మం, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల పైన ఉండటం వలన కళ్లు , నోరు పొడిబారడం, ఛాతిలో నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వలన గుండెనొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు :

సి.బి.పి, ఇ.ఎ్‌స.ఆర్‌, ఆర్‌.ఏ. ఫ్యాక్టర్‌, ఏఎన్‌ఏ, యాంటీ సిసిపీ, ఎక్స్‌-రే, ఎమ్‌ఆర్‌ఐ మొదలైన పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

ఆయుర్వేద చికిత్స :

ఆయుర్వేద వైద్య చికిత్సా విధానంలో భాగంగా, రోగి శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిచడం ద్వారా ఈ వ్యాధి సంపూర్ణంగా నయం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతర కాంప్లికేషన్స్‌ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. 


ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.

For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/


Sciatica

సయాటికా నొప్పికి ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం


 సయాటికా, నడుమునొప్పి అనే పదాలు ఆధునిక యుగంలో యుక్త, మధ్య వయస్సు వారిలో వినని వారు ఉండరు. శరీరంలో అన్నిటి కన్నా పెద్ద నరం సయాటికా. ఇది కింది వీపు భాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగం గుండా పాదాల వరకు ప్రయాణిస్తుంది. మనిషి శరీర భాగాల్లో ముఖ్యమైనది వెన్నుపూస. సయాటికా నరం ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది. (ఎల్‌4, ఎల్‌5, ఎస్‌1,ఎస్ 2,ఎస్‌3) వెన్నుపూస లోపల నుంచి ప్రయాణించు నరాలపైన ఒత్తిడి వల్ల కాలు వెనక భాగం నొప్పికి గురవుతుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. వివిధ రకాల ఒత్తిడి వల్ల జీవన విధానంలో మార్పుల వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల, వెన్నెముకపై తీవ్రప్రభావం పడి వెన్నుపూసలో అరుగుదల మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్నిమిలియన్ల మంది సయాటికా బారినపడ్డారు.


సాధారణంగా అధిక బరువు ఎత్తడం వల్ల చాలా సేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల ముందుకు వంగి పనిచేయడం వల్ల వెన్నుముకపై ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా వెన్నుముక కండరాలపై, నరాలపై ఒత్తిడినొప్పి ప్రారంభమవుతతుంది. ఈ నొప్పి వర్ణనాతీతంగా ఉంటుంది. వారి దైనందిన జీవితంలో ఆటంకం కలిగిస్తుంది. మొదట నొప్పి మొదలయినపుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను కొద్ది రోజుల్లో దూరం చేసుకోవచ్చు. కాని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. వెన్నుముక నొప్పి 12 వారాలకు పైగా ఉన్నట్లయితే దానిని దీర్ఘకాలిక నొప్పిగా పరిగణించి వైద్యులను సంప్రదించాలి.

కారణాలు:

శారీరకశ్రమ, వ్యాయామం లేక కీళ్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సయాటిక నొప్పి రావచ్చు.
స్పైనల్‌ డిస్క్‌ హెర్నియేషన్‌(ఎల్‌4, ఎల్‌5) నరాల రూట్స్‌ ఒత్తిడికి గురై సరైనపొజిషన్స్‌లో వంగక పక్కకు జరిగి నొప్పి రావచ్చు
బరువులు మోయడం వల్ల వెన్నుముకలోని కండరాలు, లిగమెంట్‌పై భారం పడినొప్పి వస్తుంది.
పని ఒత్తిడి పెరిగినపుడు, బరువులను ఎత్తడం వల్ల కొన్నిసార్లు డిస్క్‌ పక్కకు జరిగిపోతుంది. దీనిని స్లిప్‌ డిస్క్‌ అంటారు.
వయసు పెరిగిన కొద్దీ ఎముకలలో అరుగుదల వల్ల నొప్పి రావచ్చు.

లక్షణాలు:

కూర్చుంటే నొప్పి, కూర్చుని లేచేటప్పుడు విపరీతమైన నొప్పి.
కండరాల శక్తి కోల్పోయి మంట, భరింపరాని నొప్పి వస్తుంది.
నరాలపై ఒత్తిడి పెరిగినపుడు కాళ్లలో నొప్పి రావడం తిమ్మిర్లు రావడం జరుగుతుంది.
డిస్క్‌ కంప్రెషన్‌ మూలంగా స్పైనల్‌ కెనాల్‌ మూసుకుపోవడం వల్ల నడవలేకపోవడం కాళ్లలో వణుకురావడం, మూత్రవిసర్జన, మల విసర్జనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

వ్యాధి నిర్ధారణ: 

ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, సిబిపి, ఈఎస్ ఆర్‌, డిస్క్‌ప్రొలాప్స్‌, డిస్క్‌హెర్నియేషన్‌.

ఆయుర్వేద చికిత్స:

సయాటికా నొప్పికి వెన్నుముక సమస్యకు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది. రోగి శారీరక లక్షణాలు, ఇతర ఆరోగ్య కారణాలను అనుసరించి మందులు ఇవ్వడం జరుగుతుంది.   మందులు అనుభవజ్ఞులైన డాక్టర్‌ పర్యవేక్షణలో వాడితే నొప్పి సమూలంగా , శాశ్వతంగా నయమవుతుంది.



ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Bronchitis asthma

Bronchitis asthma.,. ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ...