Sunday, August 6, 2017

మడమ నొప్పి

ఏ అవయవం పనితీరు పైనైనా మన దృష్టి పడుతోందీ అంటే ఆ అవయవంలో ఏదో సమస్య ఉందని అర్థం. ఎవరైనా మడమల్నీ, పాదాల్నీ తరుచూ చూసుకుంటూ, ఆవైపు, ఈ వైపు నొక్కుకుంటున్నారూ అంటే నిరంతరంగా, ఏదో బాధ వేధిస్తోందని ఇట్టే గ్రహించవచ్చు.. అయినా శరీరంలో కళ్లూ, కాళ్లూ సరిగా లేనిదే అడుగైనా ముందుకు వేయలేం కదా! మడమనొప్పులు ఉన్నవారి పరిస్థితే ఇది. ఈ సమస్య రావడానికి గల కారణాల్లోకి వెళితే....
నడిచే విధానం సరిగా లేకపోయినా, వాడే చెప్పులు సరియైనవి కాకపోయినా, ఎత్తుపల్లాల్లో నడుస్తున్నప్పుడు అడుగులు సరిగా వేయలేకపోయినా మడమ నొప్పులు వస్తాయి. ఇవే కాకుండా, స్థూలకాయం ఉన్నా, వాత సంబంధిత వ్యాధులున్నా, ధాతుక్షయం జరిగినా మడమనొప్పులు వస్తాయి. రోజూ కనీసంగానైనా నడవలేకపోయినా, అతిగా నడిచినా, అత్యుష్ణము అను కారణాలచేత కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి సమస్యకు అదేపనిగా మందులు వాడకుండా, ఆయుర్వేదంలోని గృహవైద్య విధానంతో పూర్తిగా బయటపడే ప్రయత్నం చేయవచ్చు.
కొన్ని ఉత్తమ చిట్కాలు:
(1) శొంఠిని శుభ్రపరిచి చూర్ణం చేసి ఉంచుకోవాలి. అందులోంచి 5 గ్రాముల శొంఠి చూర్ణాన్ని, 100 మి. లీటర్ల నీళ్లల్లో కలిపి, అవి 50 మి.లీటర్లు అయ్యేదాకా బాగా కాచి, అలా తయారైన కషాయాన్ని వడగట్టి అందులో 15 మి. లీ ఆముదం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు నొప్పి పూర్తిగా తగ్గేవరకు తాగాలి.
(2) నిమ్మకాయలను రెండు ముక్కలుగా కోసి, పెనం పైన వేడి చేసి, మడమల మీద కాపడం పెట్టాలి.
(3) పెట్రోల్ ను నొప్పి వున్న భాగంపై మర్ధన చేయడం అనేది మడమనొప్పికి అత్యుత్తమ చికిత్సగా చెప్పవచ్చు.
పైన చెప్పినవి పాటించడంతో పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, కళ్ళు ఉప్పును నిప్పుపై వెచ్చ చేసి, ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తూ ఉంటే మడమనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

No comments:

Post a Comment

Bronchitis asthma

Bronchitis asthma.,. ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ...