Sunday, August 6, 2017

Back Pain

ఆయుర్వేదంతో వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం


ఈ రోజుల్లో స్పాండిలైటిస్‌ అనే  మాట ప్రతి పదిమందిలో ముగ్గురి నోట వినిపిస్తూనే ఉంది.  మూలస్థంభం లాంటి వెన్నెముక దెబ్బ తింటే ఎవరైనా ఆ విషయమై మాట్లాడకుండా ఎలా ఉంటారు?  కాకపోతే  వెన్నెముక లేదా డిస్కులకు సంబంధించిన ప్రతి సమస్యకూ సర్జరీయే పరిష్కారం అంటూ సాగుతున్న ప్రచారం చాలామంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నునొప్పి కోసం సర్జరీ చేయించుకుంటే ఆ నొప్పి తాత్కాలికంగా తగ్గుతోందే కానీ, శాశ్వతంగా పోవడం లేదు.  దానికి వెన్నునొప్పి రావడానికి గల అసలు కారణం తెలియకపోవడమే సమస్య అయితే,  వాత,పిత్త,కఫాల దోషాలను, ధాతుక్షయాన్ని సమర్థవంతంగా నిర్మూలించడం ద్వారా ఆయుర్వేదం ఒక్కటే  స్పాండిలైటిస్‌ సమస్యలను సమూలంగా తొలగించగలుగుతుంది.                              

జీవితాంతం మనం వెన్నెముకతో సహజీవనం చేస్తున్నా దాని గురించి మనకు  తెలిసింది చాలా తక్కువ. వాస్తవానికి  వెన్నెముకది ఒక అద్భుతమైన నిర్మాణం. శరీరాన్ని నిలబెట్టడంలో దాని భూమిక ఎంతో కీలకం. శరీరంలోని సమస్త అవయవాలకూ వెన్నెముక ఒక మూలస్థంభంలా ఉంటుంది. అలా ఒక మూల స్థంభంలా నిలబడటానికి వెయ్యికి పైగా లిగమెంట్లు, కీళ్ల కదలికలకు తోడ్పడే  134 సర్ఫేస్‌లు ఉంటాయి.  మెదడు చివరనుంచి మొదలయ్యే ఈ వెన్నెముకలో మెదడులో ఉండే న్యూరల్‌ సెల్స్‌, వెన్నెముకలోనూ ఉంటాయి. వెన్నెముక శరీరానికీ మెదడుకూ మధ్య ఒక సంధాన కర్తగా ఉంటుంది. అన్నిటినీ మించి మెదడు పంపించే ప్రతి సంకేతాన్నీ, ప్రతి సమాచారాన్నీ శరీరానికి చేరవేసే ఒక రహదారి. మరోరకంగా చెప్పాలంటే వెన్నెముక ఆరోగ్యానికి సంబంధించిన ఒక కీబోర్డు. అన్నీ సవ్యంగా ఉంటే వెన్నెముక దాని విధి నిర్వహణలన్నీ సఖ్యంగానే ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో ఒక చోట తేడా వచ్చినప్పుడు మొత్తం వ్యవస్థ అంతా చిందరవందర అవుతుంది.

కారణాలు అనేకం:

ఆధునిక జీవన శైలిలో పలు అంశాలు ఇందుకు కారణమవుతాయి. వాటిలో ప్రత్యేకించి సమయపాలన లేని భోజనం కావచ్చు. గంటల తరబడి  కద లకుండా కూర్చునే ఉద్యోగ వ్యాపారాలు  కావచ్చు. కదలడం, కూర్చోవడం, నిలుచోవడం వంటి భంగిమల్లోని లోపాలు కావచ్చు. వ్యాయామమే లేకపోవడం కావచ్చు. లేదా అతిగా వ్యాయామం చేయడమే కావచ్చు. ఎడతెగని ఒత్తిళ్లే కావచ్చు. మొత్తంగా చూస్తే  వీటన్నిటి ద్వారా మన శరీరాన్ని మనం దెబ్బ తీసుకుంటున్నాం. దీనివల్ల వెన్నులో భాగమైన కార్టిలేజ్‌, లిగమెంట్లు, టెండాన్లు ఎముకలు దెబ్బతిని  మెడ, వెన్ను భాగాల్లో ఎన్నో తేడాలు వస్తాయి, ఇలాంటి పలురకాల తేడాలతో వచ్చే సమస్యల్లో స్పాండిలైటిస్‌ ఒకటి. నిరంతరం దెబ్బతింటూ, క్షీణావస్థకు గురికావడం వల్ల వెన్నెముకలో వచ్చే ప్రధాన సమస్య ఇది.

స్పాండిలైటిస్‌ అంటే?:

వెన్నెముకలోఉండే కీళ్లకు ఒక క్షీణగతికి తెచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌ రావడాన్నే స్పాండిలైటిస్‌ అంటారు. వెన్నుపూసలో ఉండే దృఢత్వం తగ్గిపోవడం ఇందులోని ప్రధాన సమస్య. వెన్నుపూస దెబ్బతిన్న చోట  బోనీ స్పర్స్‌ లేదా అస్టియో ఫైట్స్‌ అనే బొడిపెలు ఉత్పన్నమవుతాయి.  ఇవి వెన్నుపాము మీద ఒత్తిడి కలిగిస్తాయి. నరాలు, వెన్నెముకపై ఒత్తిడి పడితే  దాని తాలూకు సమస్యలు మొదలవుతాయి. ప్రత్యేకించి మెదడునుంచి శరీరానికి చేరవలసిన సంకేతాలకు , సమాచారానికి సంబంధించిన మార్గం తెగిపోతుంది. ఒకప్పుడు ఈ సమస్య దాదాపు  45 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించేది. ఆధునిక కాలంలో ఇది వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వచ్చేస్తోంది.

అయితే పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు వారిలో సహజంగా ఉండే రుతుక్రమం, హార్మోనల్‌ సమస్యలు, మెనోపాజ్‌కు ముందు లేదా  తరువాత వారిలో వచ్చే హార్మోన్‌ సంబంధిత మార్పులు  గర్భధారణ కారణంగా పెరిగే ఒత్తిళ్లు ఇందుకు ప్రధాన  కారణంగా ఉంటాయి. ప్రత్యేకించి క్యాల్షియం లోపాలను కలిగించే ప్రతి సమస్యా స్పాండిలైటిస్‌కు కారణమవుతూ ఉంటుంది. దీనికి తోడు స్థూలకాయం కూడా ఇందుకు కారణమే. గతంలో మెడ, వెన్ను భాగంలో శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా ఈ సమస్యకు గురికావచ్చు. వీరిలో డిస్కు సమస్యలు ఉన్నవారు కూడా స్పాండిలైటిస్‌ సమస్యకు గురికావచ్చు. ఎముకలు గుల్లబారిపోయే ఆస్టియోపొరోసిస్‌ ఉన్నవారు కూడా ఈ సమస్యకు గురికావచ్చు.

స్పాండిలైటిస్‌లో ఏమవుతుంది?

రోజురోజుకు  వెన్నెముక క్షీణిస్తూ వెళ్లడాన్నే స్పాండిలైటిస్‌ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో వెన్నెముకకు, డిస్కులకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల డిస్కుకి పైన, కింద ఉండే అంచులకు నీటిని పీల్చుకునే గుణం తగ్గిపోతుంది. ఇలా వాటి  నీటి పరిమాణం తగ్గడం వల్ల డిస్కులు కుదించుకుపోతాయి. వాటి ఎత్తు తగ్గిపోవడం చాలా స్పష్టంగా  కనిపిస్తుంది. ఆయా భాగాలు విస్తరించే గుణం కూడా కోల్పోతాయి. ఫలితంగా అక్కడున్న కణజాలమంతా  గట్టిపడిపోతుంది. వెన్నుపూసలో పూసకూ పూసకూ మధ్య ఉండే ఫేసెట్‌ జాయింట్ల మీద ఒత్తిడి పెరిగి రాపిడి పెరుగుతుంది. దీనివల్ల కార్టిలేజ్‌ దెబ్బతింటుంది.

 అయితే శరీర తన సహజ స్వభావం కొద్దీ దెబ్బ తిన్న భాగాలకు క్యాల్షియంను చేరవేస్తుంది. అవసరానికి మించి అలా క్యాల్షియంను చేర్చడం ద్వారా అక్కడ ఆస్టియోఫైట్స్‌ అంటే బొడిపెలు ఏర్పడతాయి. ఒకసారి  బొడిపెలు ఏర్పడటం మొదలయ్యిందీ అంటే అది ఎప్పటికీ తగ్గదు. ఎన్నిసార్లు శస్త్ర చికిత్సలు చేసినా ప్రయోజనం ఉండదు. ఈ బొడిపెలు పక్కనున్న నరాలు అంటే వెన్నుపాము మీద ఒత్తిడి  పడుతుంది. వెన్ను భాగంలో ఇన్ని మార్పులు జరిగినా స్కానింగ్‌ పరీక్షల్లో  అన్నీ నార్మల్‌గానే కనపడతాయి. చాలా మంది డాక్టర్లు  అసలు  మీకు ఏ సమస్యాలేదని. మీరు మానసికంగా అలాంటి భ్రాంతికి గురవుతున్నారని, ఇది సైకోసొమాటిక్‌ వ్యాధి అని  చెప్పి వదిలేస్తారు. పరీక్షా రిపోర్టులు నార్మల్‌ అని వచ్చినంత మాత్రాన మీరు ఆరోగ్యవంతులని కాదు కదా! మీరు అనారోగ్యంతో ఉన్నారని మిమ్మల్ని వేధిస్తున్న లక్షణాలే  చెబుతున్నాయి.

 ఆధునిక పరీక్షల్లో వ్యాధి ఒక పూర్తి రూపం ధరించినప్పుడు తప్ప వ్యాధిగా మారుతున్న  క్రమంలో గుర్తించే శక్తి లేదు. అయితే ఆయుర్వేద పరీక్షల్లో మాత్రం ఈ స్థితిలో కూడా సమస్యను గుర్తించే మార్గం ఉంది. అత్యంత సూక్ష్మస్థాయిలో అంటే వాయురూపంలో ఉండే వ్యాధిని సైతం గుర్తించగలిగే ఆయుర్వేద విధానంలోని ప్రత్యేకతే  ఇందుకు కారణం.

సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ లక్షణాలు:

మెడ, ఛాతీ భాగంలో ఉండే ఈ సర్వైకల్‌లో ఏడు డిస్కులు ఉంటాయి. అయితే సమస్య ఎక్కువగా వచ్చేది సి4-సి5, సి5-సి6, సి6-సి7 డిస్కుల్లోనే. ఈ భాగంలో సమస్య తలెత్తినప్పుడు  కొద్దిపాటి అసౌకర్యంగానో, స్వల్పమైన నొప్పిగానో, లేదా భరించలేనంత నొప్పిగానో ఉండవచ్చు. నొప్పి మరీ తీవ్రమైనప్పుడు కనీసం కదల్లేని స్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ స్థితిలో నొప్పి మూడు దశల్లో ఉంటుంది. అందులో  సర్వైకల్‌  ర్యాడికులోపతి, సర్వైకల్‌ మైలోపతి, సర్వైకల్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ ఇవి  ఆ మూడు దశలు. సర్వైకల్‌ ర్యాడికులోపతిలో ఇందులో ప్రధానంగా తలనొప్పి ఉంటుంది. నొప్పి మెడ, భుజాల మద్య, చేతిపొడవునా ఉండవచ్చు చెయ్యంతా లాగినట్లు అనిపించవచ్చు. ముఖంలోని వివిధ భాగాల్లో నొప్పి అనిపించవచ్చు.  ఒక్కోసారి కళ్లు తిరిగిపడిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సర్వైకల్‌ మైలోపతిలోచేతి, భుజం కండరాలు బలహీనమవుతాయి, ఫలితంగా  అల్లికలు, కుట్లు, పెయింటింగ్‌, రైటింగ్‌ ఇలాంటి నైపుణ్యాలన్నీ దెబ్బ తింటాయి. మెడ, భుజం భాగాల్లో కండరాలన్నీ క్షీణిస్తూ, ఎండిపోయినట్లుమారతాయి. బ్యాలెన్స్‌ కోల్పోయి పదే పదే పడిపోయే స్థితి కూడా ఏర్పడవచ్చు. సర్వైకల్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ నొప్పి ఏదో ఒక కేంద్రీకృతమై ఉండడాన్ని ఆగ్జియల్‌‘ జాయింట్‌ పెయిన్‌ అంటారు.

లంబార్‌ స్పాండిలైటిస్‌:

ఎల్‌1 నుంచి ఎల్‌5-ఎస్‌1 దాకా ఈ సమస్య ఉండవచ్చు. ఇందులోనూ లంబార్‌ ర్యాడికులోపతి, లంబార్‌ మైలోపతి, లంబార్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ అంటూ మూడు దశలు ఉంటాయి. ర్యాడికులోపతిలో నొప్పి, పొడిచినట్లు ఉండడం, మంట, మొద్దుబారడం వంటి లక్షణాలు ఉంటాయి. పిరుదు, తొడవెనుక భాగం, పిక్కల వెనుక భాగంలో మడమ, పాదాల్లో  ఈ భాధలు ఉంటాయి. ఇది గజ్జల భాగంలో కొన్ని సార్లు వృషణాలు, జననాంగం దాకా ఈ నొప్పి ఉండవచ్చు. తొడ, పిక్కలు పట్టేసే సయాటికా లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఒక్కోసారి కడుపులోనూ, మూత్రాశయంలోనూ నొప్పి రావచ్చు. మైలోపతిలో కాళ్లలోని  కండరాలన్నీ క్షీణించిపోయి నడవడం కాదు ఒక దశలో అసలు  కదల్లేని స్థితి ఏర్పడవచ్చు. మల మూత్ర విసర్జనలోనూ సమస్య  మొదలు కావచ్చు. డిస్కు దెబ్బ తిన్న భాగంలోనే కేంద్రీకృతమైన తీవ్రమైన నొప్పిరావచ్చు. ఎక్కువ సేపు నిలుచున్నా, కూర్చున్నా, నొప్పిరావచ్చు.

ఆయుర్వేద చికిత్స:
సమస్యకు అసలు కారణమైన వాత,పిత్త కఫాలను, అగ్నిని  సాధారణ స్థితికి తీసుకురావడం, సస్తధాతువులను సామ్యావస్థకు తీసుకు రావడం ఈ లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుంది,  ఈ  క్రమంలో ఆయా వ్యక్తుల శరీర తత్వాన్ని అనుసరించి చికిత్స వుటుంది.

 ఆయుర్వేదం ద్వారా ప్రధానంగా రెండు ప్రయోజనాలు కలుగుతాయి వాటిలో దీర్ఘకాలికంగా వెంటాడుతున్న మీ బాధలన్నీ తొలగిపోతాయి. అదే సమయంలో వచ్చిన వ్యాధి మరోసారి వచ్చే అవకాశం లేకుండా వ్యాధి మూలాలన్నీ మటుమాయమైపోతాయి. ఆయుర్వేద వైద్య చికిత్సలతో తిరిగి మీ పూర్వ ఆరోగ్యాన్ని పొందడమే కాదు, గతం కంటే అద్భుత మైన ఒక కొత్త జీవ చైతన్యం. ఒక కొత్త జీవితం మీ సొంతమవుతాయి.

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.


సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
 For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/



No comments:

Post a Comment

Bronchitis asthma

Bronchitis asthma.,. ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ...