Saturday, August 5, 2017

Sex Power

శృంగార సమస్యలకు వాజీకరణ చికిత్స

మారిన జీవనశైలి కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిడి, డయాబెటిస్‌ వంటి ఆరోగ్య సమస్యలు పురుషులలో లైంగిక పరమైన సమస్యలకు దారితీస్తున్నాయి. వీటిలో ప్రధానంగా అంగస్తంభన సమస్య పురుషులను మానసికంగా కృంగదీస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ వాజీకరణ చికిత్స ద్వారా పురుషులలో ఏర్పడే అన్ని రకాల లైంగిక సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం ఆయుర్వేదం ద్వారా సాధ్యమే.
పురుషులు బాధపడే శృంగార సమస్యలలో అంగస్తంభన, శీఘ్రస్ఖలన, కోరికలు తగ్గడం ప్రధానమైనవి. ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది అంగస్తంభన సమస్య. దీనిని ఆయుర్వేదంలో నపుంసికత లేక క్లైభ్యంగా పేర్కొనబడింది. శృంగారంలో పాల్గొన్నపుడు లేక హస్తప్రయోగం చేస్తున్నపుడు అంగం తగినంతగా స్తంభించకపోవడం లేక ఒకవేళ స్తంభించిన చివరివరకు తగినంతగా స్తంభించి ఉండకపోవడాన్ని అంగస్తంభన సమస్యగా చెప్పవచ్చును.
ఈ సమస్యతో బాధపడేవారిలో సెక్స్‌ కోరికలు మామూలుగానే ఉంటాయి. మగవారిలో సర్వసాధారణంగా అంగస్తంభన సమస్యతో 30 శాతం మంది బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మంది, 60 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం మంది అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో 60 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్లమందికిపైనే అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
కారణాలు :
అంగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్‌తో బాధపడడం జరుగుతుంది.
అంగంలోకి రక్తప్రసరణ జరగకపోవడం అన్నది అంగస్తంభన సమస్యకు ముఖ్యమైన కారణం.
అంగస్తంభన సమస్య శారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు.
మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం, డిప్రెషన్‌, ఫెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ మొదలైన మానసిక కారణాల వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.
డిప్రెషన్‌, పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్‌ సామర్ధ్యంపైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.
ఆల్కహాల్‌ తీసుకోవడం, పొగత్రాగడం, గుట్కాలు నమలడం వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుంది.
హార్మోన్ల లోపాల వల్ల ముఖ్యంగా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
అధిక బరువు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్న వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా నాడులు, రక్తనాళాలు వికృతి చెందడం వల్ల అంగస్తంభన సమస్య మిగిలిన వ్యాధుల కంటే ఎక్కువగా ఉంటుంది. నాడీ సంబంధ వ్యాధులు, సుఖ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల కూడా అంగస్తంభన సమస్యలు ఏర్పడవచ్చు.
ఎక్కువ కాలం ఇతర వ్యాధులకు వాడిన మందుల వల్ల కూడా 25 శాతం మందిలో ఈ సమస్య రావచ్చు.
అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్‌, అల్సర్‌, కేన్సర్‌ సంబంధిత వ్యాధులకు, నొప్పి, వాపు తగ్గించే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.

జాగ్రత్తలు :
అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి లేకుండా యోగ, వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, పాలు, మినుములతో చేసినవి ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆయుర్వేద వాజీకరణ చికిత్స :
అంగస్తంభన సమస్యకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి. ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శృంగార సమస్యలు, సంతానలేమి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే కేటాయించారంటే ఆయుర్వేదం ఈ సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెప్పవచ్చు. ఆ విభాగాన్నే ‘వాజీకరణ చికిత్స’గా పేర్కొన్నారు. వాజీకరణ ఔషధాలు వాడినట్లయితే పురుషులలో శృంగార సమస్యలతోపాటు సంతానలేమి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ఆయుర్వేద వాజీకరణ ఔషధాలను 4 నెలల నుండి 6 నెలలపాటు శృంగార సమస్యలపై ఆయుర్వేద వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడినట్లయితే అంగస్తంభన సమస్యను సులభంగా తొలగించుకోవచ్చు.
రహస్యంగా ఏవో క్యాప్సూల్స్ వేసుకొని సెక్స్ బలహీనతల నుండి బయట పడవచ్చనుకోవడం చాలా తప్పు. "సిరులలో కెల్ల మగసిరి మిన్న, మగసిరి లేని సిరులు నిరర్ధకం. స్త్రీ పురుషుల అన్యోన్యతకు మూలం మగసిరియే కదా".
ఈ విషయంలో సిగ్గు పడుట తగదు. సప్త ధాతు సమతుల్యత లోపించుట వలన, అనారోగ్యము వలన సెక్స్ బలహీనతలు కలుగుతున్నాయి. దీనిని ఆయుర్వేదంలో " వాజీకరణ చికిత్స " అని అంటారు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Sinusitis

సైనసైటిస్‌కు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం

నిరంతరం జలుబుతో ముఖమంతా వాచిపోయి , తలంతా బరువుగా ఉండి, జీవితాన్ని నిస్తేజం చేసే సమస్య సైనసైటిస్‌. ఏళ్ల తరబడి వేధించే ఈ సమస్యకు ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్యం ఉంది.
ముక్కు, కళ్ల చుట్ట్టూ నాలుగు గదులు ఉంటాయి. వీటినే సైన్‌సలు అంటారు. మనం శ్వాసన పీల్చినప్పుడు గాలి ముక్కునుంచి సైన్‌సలలోకి వెళుతుంది. మనం పీల్చేగాలిని సమశీతోష్ణస్థితికి తెచ్చే బాధ్యతను కూడా ఇవే నిర్వర్తిస్తాయి. సైనస్ ల నుంచి వచ్చే ద్రవాలు ముక్కు ద్వారా బయటికి వెళతాయి. అయితే ఈ సైనస్ లల్లో వైరస్‌, బ్యాక్టీరియా ఫంగ ల్‌ చేరడం వల్ల విపరీతమైన నొప్పి, మైగ్రేన్ లక్షణాలు కనిపిస్తే దాన్ని సైనసైటిస్‌ అంటారు.
ఏమిటా కారణాలు?
పలు కారణాల వల్ల సైనస్‌ ముఖ ద్వారం మూసుకుపోతుంది. లేదా వాటిల్లో మ్యూకస్‌ బాగా పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ బ్యాక్టీరియా ఇతర క్రిములు సులభంగా పెరిగి సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్ల సైన్‌సలకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వ స్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్‌ సమస్య మొదలవతుంది. కొందరికి సైన్‌సలలోల వాపు రావడంతో పాటు, బాగా నొప్పిగా ఉంటుంది. చాలా కాలం ఈ సమస్యకు వైద్య చికిత్సలు అందకపోతే, దీన్ని క్రానిక్‌ సైనసైటిస్‌ అంటారు.
లక్షణాలు:
తరుచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్‌ వ్యాధి ప్రాధమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు ఇంకా కొనసాగుతూ ముక్కులు బిగుసుకుపోయి తల అంతా బరువుగా ఉంటుంది. ఆ పైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది.
తీవ్రమైన తలనొప్పి, దగ్గుతో పాటు శ్వాస దుర్గంధంతో ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు కొందరి ముక్కులో నిరంతరం దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. ఒక దశలో మ్యూకస్‌ ముక్కు వెనుక భాగంలోంచి గొంతులోకి వెళుతుంది.
ముఖంలో వాపు కనిపిస్తుంది. దంతాలు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కలుగుతుంది. కొద్ది రోజులకు వాసన తెలియకుండా పోతుంది. గొంతు మంటగానూ, నోరు చేదుగానూ మారుతుంది. కొందరిలో వినికిడి సమస్యలు కూడా మొదలవుతాయి. అలసటతో పాటు తరుచూ జ్వరం లేదా శరీరం వేడేక్కడం జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి సైనసైటిస్ తో బాధ పడుతున్నాడని భావించాలి.
ఏ సైనస్ లకు సమస్య ఉంటే ఆ ప్రాంతంలో నొప్పి, మొద్దుబారినట్టు ఉంటుంది. కంటి పై భాగంలో ఉండే సైనస్ లకు సమస్య వస్తే నుదుటి భాగం, కనుబొమ్మల ప్రాంతం అంతా నొప్పిగా ఉంటుంది. చెంప ఎముకలో సమస్య వస్తే, కళ్ల కింది భాగం, పై దవడ, పళ్లు నొప్పిగా ఉంటాయి. రెండు కళ్ల మధ్య బాగంలో సమస్య వస్తే, ముక్కు చుట్టు పక్కల అంతా నొప్పి వస్తుంది. కళ్ల చుట్టూ వాపు ఏర్పడుతుంది. ముఖం లోపలి భాగాలకు సైనస్‌ వస్తే తల, చెవి, మెడ నొప్పి వస్తుంది. సైనస్‌ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేరు.
ఆయుర్వేద చికిత్స:
ఆయుర్వేద చికిత్సతో సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్‌ సమస్యను సమూలంగా తొలగించవచ్చు. పైగా ఆయుర్వేద మందులతో ఏ విధమై దుష్ప్రభావాలూ ఉండవు. నిజానికి ఇతర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అదే ఆయుర్వేద చికిత్సతో అయితే సమస్య సమూలంగా శాశ్వతంగా తొలగిపోతుంది.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Immunity

మన ఇమ్యూనిటీని పెంచుకుందామా......

మెన్నమొన్నటిదాకా ఉరుకులు.. పరుగులతో పనిచేసిన వ్యక్తి ఉన్నట్లుండి ఉసూరుమంటూ ఇలా అయిపోయాడేమిటి?
అయిన వాళ్లూ, ఆత్మీయులందరికీ ఇదో అంతుచిక్కని విషయమైపోయింది. అదేమిటో గానీ, గత కొద్దిరోజులుగా చర్మమంతా పాలిపోతూ, నిర్జీవంగా మారిపోయింది. తరుచూ, జ్వరమూ, దగ్గులతో సతమతమవుతున్నాడు. కళ్లు పీక్కుపోయి, కాళ్లూ, చేతులు సన్నబడి, ఏ పనిచేయాలన్నా తెగ ఆయాసపడుతున్నాడు. పలురకాల పరీక్షల్లో చివరికి అతని వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోయినట్లు బయటపడింది. అవునుమరి! వ్యాధినిరోధక శక్తి కోల్పోవడం అంటే, ప్రాణశక్తిని కోల్పోవడమే కదా! ఆ శక్తే కోల్పోతే శరీరం సమస్త రోగాలకు నిలయం అవుతుంది!
వాస్తవానికి, ప్రకృతి మనకేదో శరీరాన్ని మాత్రమే ఇచ్చి అలా వదిలేయలేదు. దాన్ని నిరంతరం కాపాడే అంగరక్షక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థనే మనం వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూన్‌ సిస్టమ్‌) అంటాం. ఆ వ్యవస్థే లేకపోతే కోటానుకోట్ల హానికారక వైరస్‌, బ్యాక్టీరియాల బారిన పడకుండా మిగిలే వాళ్లమే కాదు. కాకపోతే ఈ వ్యవస్థ కొందరిలో వివిధ కారణాల చేత ఉండాల్సినంత బలంగా ఉండదు. బాగా బలహీనపడిపోయి, పలురకాల వ్యాధులకు పుట్టినిల్లవుతుంది. అయితే, ప్రకృతి సహజంగా సిద్ధించిన వ్యాధి నిరోధక శక్తి ఏ కారణంగానో హరించుకుపోయినంత మాత్రాన, అంతా అయిపోయినట్టేమీ కాదు. దాన్ని పునరుద్దరించుకునేందుకు తోడ్పడే బలమైన ఔషధాలు, మనకు అందుబాటులో ఉన్నాయి.

ఏమిటీ వ్యాధినిరోధక శక్తి?

ఇదొక రక్షణ వ్యవస్థ. శరీరం రోగగ్రస్తం కాకుండా వివిధ ప్రక్రియల ద్వారా ఇది అంతర్గత, బాహ్య వ్యవస్థలన్నింటినీ సురక్షితంగా ఉంచుతుంది. ఈ ఇమ్యూన్‌ సిస్టమ్‌ అంతా ఒకటిగా కాకుండా కొన్ని ఉపభాగాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఇన్నేట్‌ ఇమ్యూనిటీ, అడాప్టివ్‌ ఇమ్యూనిటీ, హార్మోనల్‌ ఇమ్యూనిటీ, సెల్‌- మీడియేటెడ్‌ ఇమ్యూనిటీ, న్యూరో ఇమ్యూనిటీ ఇలా వివిధ భాగాలుగా ఉంటుంది.
అయితే వ్యాధినిరోధక వ్యవస్థలో ఏకారణంగానైనా లోపాలు ఏర్పడినప్పుడు ఆటో- ఇమ్యూన్‌ వ్యాధులు, ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు, కేన్సర్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ దశలో శరీరం హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల్లో భాగంగా... విటిలిగో, సొరియాసిస్‌, అర్టికేరియా, డయాబెటీస్‌ వంటి రోగాలు చుట్టుముడతాయి.
అందుకు భిన్నంగా వ్యాధి నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే, దెబ్బ తిన్న కణజాలాన్ని కూడా అది బాగుచేస్తుంది. దెబ్బ తిన్న కణాల చోట పునురుత్పత్తి ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది. మొత్తం కణజాల వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. వ్యాధినిరోధక వ్యవస్థను పదును పెట్టడంలో హార్మోన్‌ల పాత్ర కీలకం. వ్యాధినిరోధకశక్తి... విటమిన్‌-డిని సంగ్రహించే శక్తిని పెంచుతుంది.

ఇమ్యూనిటీ లోపాలు:

వ్యాధినిరోధక వ్యవస్థ తన సహజమైన విచక్షణా జ్ఞానం కోల్పోవడం ఇక్కడ సమస్య. తన శరీరంలోని కణజాలాన్నే పరాయిగా పొరబడి తన శరీరం మీద తనే దాడికి దిగడం ఇందులోని విడ్డూరం. ఈ స్థితినే ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అంటారు. ఈ లోపాల్లో మరొకటి హైపర్‌ సెన్సివిటీ. అతిగా స్పందించే తత్వం దీని గుణం దీనివల్ల ప్రధానంగా అలర్జీ సమస్యలు తలెత్తుతాయి. అలర్జీల వల్ల కొద్దిపాటి అసౌకర్యం నుంచి ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. ఒక్కోసారి స్వీయ కణజాలాన్ని ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది. దీన్ని సైటీటాక్సిక్‌ ప్రతిచర్యగా పిలుస్తారు. దీనివల్ల చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇమ్యూనిటీ లోపాలు నిద్రలేమి సమస్యకు కూడా కారణమవుతాయి.

పునఃస్థాపన ఎలా సాధ్యం?

వ్యాధినిరోధక శక్తి లోపాల వల్ల శరీర కణజాలం దెబ్బతిన్నప్పుడు వాటిని పునస్థాపన చేయడం చాలా అవసరం. అలా చేసినప్పుడే వ్యాధినిరోధశక్తి తన సహజ ప్రక్రియలను తిరిగి ప్రారంభిస్తుంది. దీనివల్ల కణాలు జీవశక్తిని పుంజుకోవడంతో పాటు కణజాలాల్ని రిపేర్‌ చేసే ప్రో- ఇన్‌ప్లమేటరీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వ్యవస్థల మధ్య ఒక వారధి ఏర్పడుతుంది.. అందుకు ఉపకరించే ఔషధాలను ఆయుర్వేద వైద్య శాస్త్రం సిద్ధం చేసింది.

‘సప్త ధాతు వృద్ధి‌’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఔషధం, మాత్రల రూపంలో రూపంలో లభిస్తుంది. ఏదో ఒక రుగ్మతతో బాధపడే వారు ఏ వయసులో ఉన్నవారైనా ఈ ఔషదాన్ని తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారైతే 35 ఏళ్లు దాటితే తీసుకోవచ్చు. ఏ కారణంగా తీసుకున్నా మూడు నాలుగు మాసాల దాకా క్రమం తప్పకుండా వాడాలి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీవక్రియలను కుంటుపరిచే మెటబాలిక్‌ సిండ్రోమ్‌ను పారదోలుతుంది. ఇవి ఆరోగ్యాన్ని పరిపుష్టం చేయడం ద్వారా మనిషి ఆయుష్సును కూడా గణనీయంగా పెంచుతుంది.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Kidney Stones

కిడ్నీలో రాళ్లు... ఆయుర్వేదం

కిడ్నీలో రాళ్లు అనగానే చాలామంది పాలకూర, టమోట తినడం వల్ల ఏర్పడతాయి అనడం అపోహ. అవి కేవలం ప్రేరేపితాలు మాత్రమే. కారణాలు కావు. అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి, ఎవరిలో ఏర్పడతాయి వగైరా వాటి గురించి మనం తెలుసుకుందాం.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15 శాతం ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 20 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో స్త్రీల కంటే పురుషులలో 2 నుంచి 3 రెట్లు అధికంగా గమనించవచ్చు. చిన్న పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి లవణాల సమతుల్యతను కాపాడుతుంది. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటిక రూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరుతాయో అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశంలో ఎక్కడైనా రాళ్లు ఏర్పడతాయి. కాని వాడుక భాషలో వీటన్నింటిని ‘కిడ్నీలో రాళ్లు’ అంటుంటారు.

కారణాలు:

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరికొన్ని ఇతర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక మోతాదులో కిడ్నీలు ఆక్జలేట్స్‌, కాల్షియం, యూరిక్‌ యాసిడ్‌, సిస్టీన్‌ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించటం వల్ల రాళ్లు ఏర్పడతాయి. కొందరిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్లు, మూత్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడటం, హైపర్‌ పారాథైరాయిడిజం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలోని విటమిన్‌-ఎ శాతం తగ్గడం తదితర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవికాకుండా మూత్రంలోని రాళ్లని ప్రేరేపించే కారణాలను ప్రిడిస్పోసింగ్‌ ఫ్యాక్టర్స్‌ అంటారు.

ఇవి ముఖ్యంగా ఆహారంలో మాంసకృతులు అధికంగా వుండడం, కొన్ని ఇతరత్రా జబ్చుల వల్ల ముఖ్యంగా హైపర్‌కాల్సేమియా, చిన్నప్రేగు ఆపరేషన్లు, రీనల్‌ట్యూబులార్‌ అసిడోసిస్‌, జన్యుపరమైన కారణాల వల్ల, కొన్ని రకాలైన మందులు ఆంటాసిడ్స్‌, విటమిన్‌-సి, కాల్షియం సప్లిమెంట్ల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

లక్షణాలు:

విపరీతమైన కడుపునొప్పి, నడుమునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి ప్రధాన లక్షణాలు. కొంత మందిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం వల్ల ఏదో ఒకవైపు నడుంనొప్పి రావడం, నొప్పితోపాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే రీనల్‌ కోలిక్‌ అంటారు. కొంతమందిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీనివల్ల కలిగే నొప్పిని యురిటరిక్‌ కోలిక్‌ అంటారు. నడుము, ఉదరం మధ్యభాగంలో విపరీతమైన నొప్పిరావడాన్ని ఫ్లాన్క్‌పెయిన్‌ అంటారు. అక్కడ నుంచి నొప్పి పొత్తి కడుపుకు, గజ్జలకు లేదా కాళ్లలోకి పాకుతుంది.

నొప్పితోపాటు వాంతులు, జ్వరం, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం, చీము కూడా కనిపిస్తుంది. మరికొందరిలో కండరాల బిగుతు, నడుము, ఉదరం మధ్యభాగంలో వాపు, కడుపుబ్బరం వంటి లక్షణాలు కనబడతాయి. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలూ కనపడకపోవచ్చు. అలా లక్షణాలేవీ కనపడకుండా కిడ్నీలో ఏర్పడే రాళ్లను సైలెంట్‌ స్టోన్స్‌ అంటారు.

నిర్ధారణ పరీక్షలు:

1. మూత్రపరీక్ష (మూత్రంలోని హానికరమైన బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు, రక్త కణాలు, స్పటికలు, క్యాస్ట్స్‌లను పరీక్షించడం).
2. రక్త పరీక్ష (రక్తంలోని తెల్లరక్త కణాల శాతం, సీరం, కాల్షియం, రీనల్‌ ఫంక్షన్‌లకు పరీక్షించడం)
3. ఎక్స్‌రే కేవీబీ, అల్ర్టాసౌండ్‌, సి.టి.స్కాన్‌, సిస్టోస్కోపి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారింవచ్చు.

ఆయుర్వేద చికిత్స:
ఆయుర్వేద‌ వైద్య పద్ధతి ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించవచ్చు. వ్యాధి లక్షణాలతోపాటు మానసిక, శారీరక లక్షణాలు కూడా పరిగణలోకి తీసుకొని ట్రీట్‌మెంట్‌ ఇస్తారు.
శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తర్వాత కూడా కిడ్నీల్లో రాళ్లు మళ్లీ వచ్చే అవకాశం 50శాతం ఉంది. కానీ, ఆయుర్వేద వైద్యం ద్వారా కిడ్నీలోని లవణాల సమతుల్యతను కాపాడి, కిడ్నీల పని తీరు మెరుగుపరచడంతో మళ్లీ రాళ్లు ఏర్పడకుండా పూర్తిగా నయం చెయ్యవచ్చు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Gall Bolder Stones

గాల్ బ్లాడర్ స్టోన్స్ ......ఆయుర్వేదం
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అనుకుంటారు చాలా మంది. కానీ ఆయుర్వేద చికిత్సతో ఆ అవసరం లేకుండా రాళ్లు కరిగిపోతాయి. మళ్ళీ మళ్ళీ సమస్య పునరావృతం కాదు.
ఆయుర్వేదంలో గాల్‌స్టోన్స్‌ను పిత్తాశ్మరీ అంటారు. ప్రకోపించిన వాతము పిత్తాశయంలో చేరి తన రూక్ష్మ గుణంచే పైత్యరసాన్ని ఎండింపజేస్తుంది. పిత్తము తన పాకగుణంచే దీనిని ఒక రాయిలా తయారుచేయును. దీనిని పిత్తాశ్మరీ అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది కొలెస్ట్రాల్ స్టోన్ . పైత్యరసంలో ఎక్కువగా కొలెస్ట్రాల్‌ చేరినపుడు అది పిత్తాశయంలో పేరుకుని కొలెస్ట్రాల్‌ స్టోన్ గా మారుతుంది.
రెండవది ఫిగ్మెంటెడ్‌ స్టోన్‌. కాలేయంలోని చనిపోయిన ఎర్రరక్తకణాలు నాశనం చేసేటప్పుడు (హీమోలైసిస్‌) బైలిరూబిన్‌ అనే పదార్థం విడుదలవుతుంది. ఇది ఎక్కువగా పోగై పిత్తాశయం చేరుకున్నప్పుడు పిగ్మెంటెడ్‌ స్టోన్స్ ఏర్పడతాయి.

లక్షణాలు:

ఈ పిత్తాశ్మరీ పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కుడివైపు పక్కటెముకల కింది భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు వీపు గూఢ భాగములోనికి పొడుస్తుంది. నొప్పి హఠాత్తుగా మొదలయి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు వస్తుంది. వాంతి వచ్చినట్టు ఉండటం, వాంతి రావడం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రాయి పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పిత్తాశయంలోనే రాయి స్థిరంగా ఉంటే ఒక్క లక్షణం కనిపించదు.

నిర్ధారణ:

ఎక్స్‌రే ప్లెయిన్‌ అబ్డామిన్‌, రక్తపరీక్ష, అల్ట్రాసోనోగ్రఫీ అప్పర్‌ అబ్డామిన్‌ ద్వారా నిర్ధారిస్తారు. ఎండోస్కోపిక్‌ రిట్రోగ్రేడ్‌ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ అనే నూతన పద్ధతి ద్వారా రాయి పరిమాణం, అదిఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు.

శస్త్రచికిత్స ఒక్కటే మార్గమా?

గాల్‌స్టోన్స్‌ వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు లితోట్రిప్సీ అనే సర్జికల్‌ పద్ధతి ద్వారా తీసివేయడం లేదా పిత్తాశయాన్ని తొలగించడం(కొలసిస్టెక్టమీ) చేస్తారు. ఈ విధంగా పిత్తాశయం తీసినవేసిన వారిలో అరుగుదల మందగించడం, కడుపు ఉబ్బరం, విరేచనాలు ఎక్కువ కావడం, కామెర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి శస్త్రచికిత్స చేయించుకునే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకుని సరియైున నిర్ణయం తీసుకోవాలి.

ఆయుర్వేద చికిత్స:
ఆయుర్వేదంలో వాతాదిదోషాలు ఆధారంగా చికిత్స చేయడం ద్వారా గాల్‌స్టోన్స్‌ కరిగిపపోయేలా చేయవచ్చు. శరీరంలో దోష సామ్యతను కలిగించడం ద్వారా గాల్‌స్టోన్స్‌ మళ్లీ మళ్లీ తయారుకాకుండా నివారించవచ్చు. ఆయుర్వేద చికిత్స ద్వారా పిత్తాశ్మరీని పూర్తిగా శాశ్వతంగా తగ్గించవచ్చు.

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Tuesday, October 27, 2015

THIS IS A COMPLETE GUIDE AND PERFECT TREATMENT FOR ALL TYPES OF DISEASES WITH AYURVEDIC MEDICINES. THIS IS BETTER THAN ALLOPATHY AND HOMEOPATHY. THIS IS NATURAL WAY FOR CURING DISEASES. NO SIDE EFFECTS AND REACTIONS.

Bronchitis asthma

Bronchitis asthma.,. ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ...