సైనసైటిస్‌కు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం
నిరంతరం జలుబుతో ముఖమంతా వాచిపోయి , తలంతా బరువుగా ఉండి, జీవితాన్ని నిస్తేజం చేసే సమస్య సైనసైటిస్. ఏళ్ల తరబడి వేధించే ఈ సమస్యకు ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్యం ఉంది.
ముక్కు, కళ్ల చుట్ట్టూ నాలుగు గదులు ఉంటాయి. వీటినే సైన్‌సలు అంటారు. మనం శ్వాసన పీల్చినప్పుడు గాలి ముక్కునుంచి సైన్‌సలలోకి వెళుతుంది. మనం పీల్చేగాలిని సమశీతోష్ణస్థితికి తెచ్చే బాధ్యతను కూడా ఇవే నిర్వర్తిస్తాయి. సైనస్ ల నుంచి వచ్చే ద్రవాలు ముక్కు ద్వారా బయటికి వెళతాయి. అయితే ఈ సైనస్ లల్లో వైరస్, బ్యాక్టీరియా ఫంగ ల్ చేరడం వల్ల విపరీతమైన నొప్పి, మైగ్రేన్ లక్షణాలు కనిపిస్తే దాన్ని సైనసైటిస్ అంటారు.
ఏమిటా కారణాలు?
పలు కారణాల వల్ల సైనస్ ముఖ ద్వారం మూసుకుపోతుంది. లేదా వాటిల్లో మ్యూకస్ బాగా పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ బ్యాక్టీరియా ఇతర క్రిములు సులభంగా పెరిగి సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల సైన్‌సలకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వ స్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్య మొదలవతుంది. కొందరికి సైన్‌సలలోల వాపు రావడంతో పాటు, బాగా నొప్పిగా ఉంటుంది. చాలా కాలం ఈ సమస్యకు వైద్య చికిత్సలు అందకపోతే, దీన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు.
లక్షణాలు:
తరుచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాధమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు ఇంకా కొనసాగుతూ ముక్కులు బిగుసుకుపోయి తల అంతా బరువుగా ఉంటుంది. ఆ పైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది.
తీవ్రమైన తలనొప్పి, దగ్గుతో పాటు శ్వాస దుర్గంధంతో ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు కొందరి ముక్కులో నిరంతరం దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. ఒక దశలో మ్యూకస్ ముక్కు వెనుక భాగంలోంచి గొంతులోకి వెళుతుంది.
ముఖంలో వాపు కనిపిస్తుంది. దంతాలు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కలుగుతుంది. కొద్ది రోజులకు వాసన తెలియకుండా పోతుంది. గొంతు మంటగానూ, నోరు చేదుగానూ మారుతుంది. కొందరిలో వినికిడి సమస్యలు కూడా మొదలవుతాయి. అలసటతో పాటు తరుచూ జ్వరం లేదా శరీరం వేడేక్కడం జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి సైనసైటిస్ తో బాధ పడుతున్నాడని భావించాలి.
ఏ సైనస్ లకు సమస్య ఉంటే ఆ ప్రాంతంలో నొప్పి, మొద్దుబారినట్టు ఉంటుంది. కంటి పై భాగంలో ఉండే సైనస్ లకు సమస్య వస్తే నుదుటి భాగం, కనుబొమ్మల ప్రాంతం అంతా నొప్పిగా ఉంటుంది. చెంప ఎముకలో సమస్య వస్తే, కళ్ల కింది భాగం, పై దవడ, పళ్లు నొప్పిగా ఉంటాయి. రెండు కళ్ల మధ్య బాగంలో సమస్య వస్తే, ముక్కు చుట్టు పక్కల అంతా నొప్పి వస్తుంది. కళ్ల చుట్టూ వాపు ఏర్పడుతుంది. ముఖం లోపలి భాగాలకు సైనస్ వస్తే తల, చెవి, మెడ నొప్పి వస్తుంది. సైనస్ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేరు.
ఆయుర్వేద చికిత్స:
ఆయుర్వేద చికిత్సతో సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్ సమస్యను సమూలంగా తొలగించవచ్చు. పైగా ఆయుర్వేద మందులతో ఏ విధమై దుష్ప్రభావాలూ ఉండవు. నిజానికి ఇతర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అదే ఆయుర్వేద చికిత్సతో అయితే సమస్య సమూలంగా శాశ్వతంగా తొలగిపోతుంది.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.
For Contact:Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700
follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/
No comments:
Post a Comment