మన ఇమ్యూనిటీని పెంచుకుందామా......
మెన్నమొన్నటిదాకా ఉరుకులు.. పరుగులతో పనిచేసిన వ్యక్తి ఉన్నట్లుండి ఉసూరుమంటూ ఇలా అయిపోయాడేమిటి?
అయిన వాళ్లూ, ఆత్మీయులందరికీ ఇదో అంతుచిక్కని విషయమైపోయింది. అదేమిటో గానీ, గత కొద్దిరోజులుగా చర్మమంతా పాలిపోతూ, నిర్జీవంగా మారిపోయింది. తరుచూ, జ్వరమూ, దగ్గులతో సతమతమవుతున్నాడు. కళ్లు పీక్కుపోయి, కాళ్లూ, చేతులు సన్నబడి, ఏ పనిచేయాలన్నా తెగ ఆయాసపడుతున్నాడు. పలురకాల పరీక్షల్లో చివరికి అతని వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోయినట్లు బయటపడింది. అవునుమరి! వ్యాధినిరోధక శక్తి కోల్పోవడం అంటే, ప్రాణశక్తిని కోల్పోవడమే కదా! ఆ శక్తే కోల్పోతే శరీరం సమస్త రోగాలకు నిలయం అవుతుంది!
వాస్తవానికి, ప్రకృతి మనకేదో శరీరాన్ని మాత్రమే ఇచ్చి అలా వదిలేయలేదు. దాన్ని నిరంతరం కాపాడే అంగరక్షక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థనే మనం వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూన్ సిస్టమ్) అంటాం. ఆ వ్యవస్థే లేకపోతే కోటానుకోట్ల హానికారక వైరస్, బ్యాక్టీరియాల బారిన పడకుండా మిగిలే వాళ్లమే కాదు. కాకపోతే ఈ వ్యవస్థ కొందరిలో వివిధ కారణాల చేత ఉండాల్సినంత బలంగా ఉండదు. బాగా బలహీనపడిపోయి, పలురకాల వ్యాధులకు పుట్టినిల్లవుతుంది. అయితే, ప్రకృతి సహజంగా సిద్ధించిన వ్యాధి నిరోధక శక్తి ఏ కారణంగానో హరించుకుపోయినంత మాత్రాన, అంతా అయిపోయినట్టేమీ కాదు. దాన్ని పునరుద్దరించుకునేందుకు తోడ్పడే బలమైన ఔషధాలు, మనకు అందుబాటులో ఉన్నాయి.
ఏమిటీ వ్యాధినిరోధక శక్తి?
ఇదొక రక్షణ వ్యవస్థ. శరీరం రోగగ్రస్తం కాకుండా వివిధ ప్రక్రియల ద్వారా ఇది అంతర్గత, బాహ్య వ్యవస్థలన్నింటినీ సురక్షితంగా ఉంచుతుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఒకటిగా కాకుండా కొన్ని ఉపభాగాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ, హార్మోనల్ ఇమ్యూనిటీ, సెల్- మీడియేటెడ్ ఇమ్యూనిటీ, న్యూరో ఇమ్యూనిటీ ఇలా వివిధ భాగాలుగా ఉంటుంది.
అయితే వ్యాధినిరోధక వ్యవస్థలో ఏకారణంగానైనా లోపాలు ఏర్పడినప్పుడు ఆటో- ఇమ్యూన్ వ్యాధులు, ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు, కేన్సర్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ దశలో శరీరం హెచ్‌ఐవి/ ఎయిడ్స్ వంటి ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో భాగంగా... విటిలిగో, సొరియాసిస్, అర్టికేరియా, డయాబెటీస్ వంటి రోగాలు చుట్టుముడతాయి.
అందుకు భిన్నంగా వ్యాధి నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే, దెబ్బ తిన్న కణజాలాన్ని కూడా అది బాగుచేస్తుంది. దెబ్బ తిన్న కణాల చోట పునురుత్పత్తి ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది. మొత్తం కణజాల వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. వ్యాధినిరోధక వ్యవస్థను పదును పెట్టడంలో హార్మోన్‌ల పాత్ర కీలకం. వ్యాధినిరోధకశక్తి... విటమిన్-డిని సంగ్రహించే శక్తిని పెంచుతుంది.
ఇమ్యూనిటీ లోపాలు:
వ్యాధినిరోధక వ్యవస్థ తన సహజమైన విచక్షణా జ్ఞానం కోల్పోవడం ఇక్కడ సమస్య. తన శరీరంలోని కణజాలాన్నే పరాయిగా పొరబడి తన శరీరం మీద తనే దాడికి దిగడం ఇందులోని విడ్డూరం. ఈ స్థితినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఈ లోపాల్లో మరొకటి హైపర్ సెన్సివిటీ. అతిగా స్పందించే తత్వం దీని గుణం దీనివల్ల ప్రధానంగా అలర్జీ సమస్యలు తలెత్తుతాయి. అలర్జీల వల్ల కొద్దిపాటి అసౌకర్యం నుంచి ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. ఒక్కోసారి స్వీయ కణజాలాన్ని ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది. దీన్ని సైటీటాక్సిక్ ప్రతిచర్యగా పిలుస్తారు. దీనివల్ల చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇమ్యూనిటీ లోపాలు నిద్రలేమి సమస్యకు కూడా కారణమవుతాయి.
పునఃస్థాపన ఎలా సాధ్యం?
వ్యాధినిరోధక శక్తి లోపాల వల్ల శరీర కణజాలం దెబ్బతిన్నప్పుడు వాటిని పునస్థాపన చేయడం చాలా అవసరం. అలా చేసినప్పుడే వ్యాధినిరోధశక్తి తన సహజ ప్రక్రియలను తిరిగి ప్రారంభిస్తుంది. దీనివల్ల కణాలు జీవశక్తిని పుంజుకోవడంతో పాటు కణజాలాల్ని రిపేర్ చేసే ప్రో- ఇన్‌ప్లమేటరీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వ్యవస్థల మధ్య ఒక వారధి ఏర్పడుతుంది.. అందుకు ఉపకరించే ఔషధాలను ఆయుర్వేద వైద్య శాస్త్రం సిద్ధం చేసింది.
‘సప్త ధాతు వృద్ధి’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఔషధం, మాత్రల రూపంలో రూపంలో లభిస్తుంది. ఏదో ఒక రుగ్మతతో బాధపడే వారు ఏ వయసులో ఉన్నవారైనా ఈ ఔషదాన్ని తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారైతే 35 ఏళ్లు దాటితే తీసుకోవచ్చు. ఏ కారణంగా తీసుకున్నా మూడు నాలుగు మాసాల దాకా క్రమం తప్పకుండా వాడాలి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీవక్రియలను కుంటుపరిచే మెటబాలిక్ సిండ్రోమ్‌ను పారదోలుతుంది. ఇవి ఆరోగ్యాన్ని పరిపుష్టం చేయడం ద్వారా మనిషి ఆయుష్సును కూడా గణనీయంగా పెంచుతుంది.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.
For Contact:Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700
follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/
No comments:
Post a Comment