ఆయుర్వేద వైద్యంతో పిల్లల్లో ఏకాగ్రత
హోంవర్క్ పూర్తి చేయలేకపోవడం, చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి మరో పని మొదలుపెట్టడం, ఏకాగ్రత నిలపలేకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే సాధారణమే అని చాలామంది మిన్నకుండిపోతుంటారు. కానీ అది వారి శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు చేస్తున్న పనిపై ఏకాగ్రత నిలపలేకపోతున్నారంటే అది ఏడీహెచ్‌డీ సమస్య కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
కొందరు స్కూలు పిల్లలు ఏ పని పూర్తిగా చేయరు. హోంవర్క్ కాస్త చేసి వదిలి పెడతారు. మరో పని మొదలు పెట్టి దాన్ని కూడా మధ్యలోనే ఆపేస్తారు. దేనిపైన మనసును స్థిరంగా ఉంచలేకపోతుంటారు. ఏకాగ్రత కోల్పోతుంటారు. ఈ సమస్యను అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్‌డీ)అంటారు.
ఈ సమస్య 8 నుంచి 10 శాతం మంది స్కూల్ పిల్లల్లో కనిపిస్తోంది. బాలికల కన్నా బాలురుల్లో మూడు రెట్ల ఎక్కువగా ఉంటోంది. ఈ డిజార్డర్‌తో బాధపడుతున్న వారు ఆలోచన లేకుండా పనులు చేస్తుంటారు. దీర్ఘకాలం పాటు ఇది కొనసాగినపుడు విద్యాపరంగా వెనకబడిపోతారు. సామాజిక పరంగా నలుగురిలో కలవలేకపోతారు. లక్షణాలను బట్టి ఈ డిజార్డర్‌ను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
ఇన్‌అటెంటివ్ ఏడీహెచ్‌డీ
ఈ పిల్లలు ఏకాగ్రతను లగ్నం చేయలేరు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఎంజాయ్ చేస్తారు. టాపిక్స్ వింటున్నప్పుడు ఆసక్తి కనబరుస్తారు. అయితే పని రిపీట్ అయినపుడు, బోర్‌గా ఫీల్ అయినపుడు వెంటనే మారిపోతారు. ఒక పనిని కుదురుగా చేయలేకపోవడం మరొక సమస్య. పని పూర్తి చేయకుండానే మరొక పనికి మారిపోతారు. పాఠశాల పనిని పూర్తి చేయడం వారికి కష్టంగా ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటారు. తప్పులు చేస్తూనే ఉంటారు. ఒక అంశంపై ఏకాగ్రత పెట్టలేరు. ఇతరులు చెబుతున్నప్పుడు వింటున్నట్టుగా అనిపించదు. వస్తువులను గుర్తుపెట్టుకోలేకపోతారు. అప్పగించిన ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతారు. అప్పగించిన పని పూర్తి చేసే ముందు బోర్‌గా ఫీలవుతారు. హోమ్‌వర్క్ చేయడం మర్చిపోతారు. బుక్క్, పెన్స్ ఎక్కడ పెట్టామో మరిచిపోతుంటారు.
హైపర్‌యాక్టివ్ ఏడీహెచ్‌డీ:
వీరు ఒకేసారి అనేక పనులు చేయాలని చూస్తుంటారు. ఒక యాక్టివిటీ నుంచి మరో యాక్టివిటీకి మారుతుంటారు. బలవంతంగా కూర్చోబెట్టినా కాలు నిలవదు. కాలును కదుపుతూనే ఉంటారు. చేతివేళ్లు ఆడిస్తూనే ఉంటారు. ఎక్కువగా మాట్లాడుతుంటారు. రిలాక్స్‌గా ఆడుకోలేరు. త్వరగా కోపానికి వస్తుంటారు.
ఇంపల్సివ్ ఏడీహెచ్‌డీ:
ఈ పిల్లల్లో స్వీయ నియంత్రణ ఉండదు. క్లాసులో పొంతన లేని ప్రశ్నలు అడుగుతుంటారు. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారు. మూడీగా ఉంటారు. ఎమోషనల్‌గా ఓవర్‌యాక్ట్ అవుతారు. ఏ మాత్రం ఆలోచించకుండా రియాక్ట్ అవుతుంటారు. ప్రశ్న పూర్తిగా వినకుండానే సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తారు. తన సమయం, నెంబర్ వచ్చే వరకు ఆగలేకపోతారు. తరచుగా ఇతరులను డిస్టర్బ్ చేస్తుంటారు. ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి బదులుగా గెస్ చే స్తుంటారు.
కారణాలు :
జన్యుపరమైన అంశాలు, చుట్టూ ఉన్న పరిసరాలు, ఆహారపు అలవాట్లు కొంత వరకు కారణమవుతాయి. 75 శాతం కేసుల్లో జన్యుపరమైన అంశాలు కారణంగా ఉంటున్నాయని పరిశోధనల్లో తేలింది. గర్భిణిగా ఉన్న సమయంలో పొగతాగడం, ఆల్కహాల్ సేవించడం వంటివి కూడా కారణమవుతున్నాయి. నెలల నిండకముందే డెలివరీ కావడం, ప్రెగ్నెసీ సమయంలో ఇన్‌ఫెక్షన్లు రావడం, స్ట్రెప్టోకాకల్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు వంటివి కారణంగా ఉంటున్నాయి. పండ్లు, కూరగయాలపై వాడే క్లోరోఫైరిఫాస్ అనే పురుగుల మందు వల్ల పిల్లల్లో బిహేవిరియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
ఆయుర్వేద చికిత్స:
ఏడీహెచ్‌డీ సమస్యకు ఆయుర్వేద చికిత్స అందించడం ద్వారా సమూలంగా తగ్గించే వీలుంది. శారీరక లక్షణాలను గమనించడంతో పాటు డైట్, లైఫ్‌స్టయిల్, వ్యక్తిత్వం, ఎమోషన్‌కు గురిచేస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. త్వరగా కోలుకోవడం జరుగుతుంది. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.
For Contact:Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700
follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/
No comments:
Post a Comment